చరణ్ రంగస్థలం ఫస్ట్ లుక్ షాక్..!

December 08, 2017


img

మెగా అభిమానులు మళ్లీ నిరాశలో పడ్డారు గత కొంతకాలంగా ఎంతగానో ఎంతగానో ఎదురుచూస్తున్న రంగస్థలం ఫస్ట్‌లుక్ విషయంతో మరోసారి మాట తప్పింది మైత్రీ మూవీ మేకర్స్. గత కొంత కాలంగా ఈ సినిమాలకు సంబంధించి లోకేషన్ స్టిల్స్ మాత్రమే అప్ డేట్ అయ్యాయి. ఇక ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్న సోషల్ మీడియాలో తెగ హంగామా చేసినా అది కాస్త క్యాన్సల్ అయ్యింది. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 

ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను మొదట డిసెంబర్‌ 8 సాయంత్రం 5.30 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించి తరువాత వాయిదా వేసింది. దీంతో మెగా అభిమానుల్లో కొంత అసంతృప్తి నెలకొనడంతో తాజాగా డిసెంబర్‌ 9 (శనివారం) ఉదయం 9గంటలకు రంగస్థలం 1985 ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చేసింది.      



Related Post

సినిమా స‌మీక్ష