ఐదు కథలతో నాని అ!

December 07, 2017


img

నాచురల్ స్టార్ నాని ఓ పక్క హీరోగా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తుండగా మరో పక్క నిర్మాతగా కూడా తొలి అడుగు వేస్తున్నాడు. నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా అ!. కాజల్, రెజినా, నిత్యా మీనన్, అవసరల శ్రీనివాస్, ప్రియదర్శి ప్రధాన పాత్రలుగా నటిస్తున్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ లుక్ 24లో సూర్య లుక్ లానె సర్ ప్రైజింగ్ గా ఇచ్చింది.

ఇక ఈ సినిమాలో ఐదుగురి ప్రధాన పాత్రలకు ఐదు కథలు ఉంటాయట. ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయట. రెజినా ఈ సినిమాలో అల్ట్రా మోడ్రెన్ లుక్ లో కనిపిస్తుందట. ఒంటి నిండా ట్యాటూస్ తో కనిపిస్తుందట. ప్రయోగాత్మక సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు నాని, రవితేజ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. మరి ఐదు కథతో  నాని చెప్పే ఈ అ! ఎలా ఉండబోతుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష