మెగా ఫ్యాన్స్ కు రేపు సర్ ప్రైజ్..!

December 07, 2017


img

మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న రంగస్థలం 1985 సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. సుకుమార్ డైరక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ మూవీ నుండి సర్ ప్రైజింగ్ ఫస్ట్ లుక్ రేపు అనగా డిసెంబర్ 8 సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు రిలీజ్ అవుతుందని ఎనౌన్స్ చేశారు.


సినిమా అంచనాలను పెంచేలా ఈ ఫస్ట్ లుక్ ఉంటుందని చెప్పొచ్చు. పల్లెటూరి ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయని మరోసారి దేవి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటాడని అంటున్నారు. హాట్ యాంకర్ అనసూయ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా సినిమా చరణ్ ఖాతాలో హిట్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు.Related Post

సినిమా స‌మీక్ష