మహానటి సర్ ప్రైజ్ ఇదే..!

December 06, 2017


img

మహానటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కుతున్న మహానటి సినిమా నుండి టైటిల్ లోగో వీడియో రిలీజ్ చేశారు. ఈరోజు సావిత్రి జయంత్రి సందర్భంగా ఈ మహానటి టైటిల్ లోగో వీడియోని రిలీజ్ చేశారు. మాయబజార్ లోని ప్రియదర్శిను చూపించి అది ఓ మహిళ తెరవగా టైటిల్ లోగో వచ్చింది. ఇక సావిత్రి సినిమాలోని డైలాగులు, పాటలు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చాయి. 

ఫైనల్ గా మహానటి టైటిల్ లోగొ వచ్చింది. ఎవడే సుబ్రమణ్యం దర్శకుడు నాగ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్లో ప్రియాంకా దత్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిక్కి జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తుండగా ఈ సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ, విక్రం ప్రభు, షాలిని పాండే, ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 29 న రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. 

Related Post

సినిమా స‌మీక్ష