అల్లు శిరీష్ శాటిలైట్ డీల్ అదుర్స్..!

December 06, 2017


img

గౌరవం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు హీరో శిరీష్ శ్రీరస్తు శుభమస్తు సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం విఐ ఆనంద్ డైరక్షన్ లో ఒక్క క్షణం సినిమాతో రాబోతున్నాడు అల్లు శిరీష్. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. సురభి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా జెమిని వారు 3.2 కోట్లకు కొనేశారట.

సినిమా టీజర్ తోనే అంచనాలను పెంచగా తప్పకుండా విషయం ఉన్న సినిమా అని నిర్ధారణకు వచ్చి జెమిని వారు ఫ్యాన్సీ ఎమౌట్ ఆఫర్ చేశారట. నిఖిల్ తో ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమా తీసిన విఐ ఆనంద్ అల్లు శిరీష్ తో ఒక్క క్షణం తో వస్తున్నాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ అంటున్నారు. మరి శిరీష్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష