సైరా క్లాప్ కొట్టేశారు..!

December 06, 2017


img

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహారెడ్డి సినిమాకు ఎట్టకేలకు క్లాప్ కొట్టేశారు. కొన్నాళ్లుగా సెట్స్ మీదకు వెళ్లేందుకు వాయిదా వేస్తున్న సైరా సినిమా ఈరోజు మొదట్ షాట్ తీశారు. చిరంజీవి, బ్రహ్మాజిల మధ్య జరిగే సన్నివేశంతో సైరా తొలి షాట్ షూట్ చేశారట. హైదరబాద్ పరిసర ప్రాంతంలో గల అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. 

బిగ్ బి అమితాబ్ తో పాటుగా సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రాం చరణ్ 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలుస్తుంది. నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా మ్యూజిక్ డైరక్టర్ ఎవరన్నది ఫైనల్ అవ్వలేదు.Related Post

సినిమా స‌మీక్ష