జవాన్ రివ్యూ & రేటింగ్

December 01, 2017


img

రేటింగ్ : 2.75/5

కథ :

జై (సాయి ధరం తేజ్), కేశవ (ప్రసన్న) ఇద్దరు స్నేహితులు. అయితే చిన్నప్పుడు విడిపోయిన ఈ ఇద్దరిలో జై దేశం మీద ఎంతో గౌరవంతో పెరుగుతాడు. అంతేకాదు డి.ఆర్.డి.ఓలో జాబ్ చేయాలన్న కలకంటుంటాడు. ఇక మరో పక్క అతనికి పూర్తి వ్యతిరేకంగా కేశవ తన స్వార్ధం కోసం డబ్బు సంపాదించడం కోసం దేశానికే హాని కలిగిస్తుంటాడు. ఇక డి.ఆర్.డి.ఓ సిద్ధం చేసిన ఆక్టోపస్ మిసైల్ ను కొట్టేసి ఇతర దేశాలకు అమ్మాలని చూస్తాడు కేశవ. అయితే అతనికి జై ఎలా అడ్డు పడ్డాడు అన్నది అసలు కథ. ఇక ఈ ఆపరేషన్ లో జై ఫ్యామిలీ కూడా ఎలా కష్టాల్లో పడుతుంది.. దానికి కారణాలేంటి అన్నది అసలు జవాన్ కథ.

విశ్లేషణ :

రచయితగా సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగించిన బివిఎస్ రవి దర్శకుడిగా చేసిన మొదటి ప్రయత్నం వాంటెడ్ దెబ్బ కొట్టింది. ఇక కొద్దిపాటి గ్యాప్ తో జవాన్ గా తన లక్ టెస్ట్ చేసుకుంటున్నాడు రవి. అయితే దర్శకుడు రాసుకున్న కథ కాస్త కొత్తగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా తను బలం అనుకున్న సందర్భాలలో సినిమాను బాగా తెరకెక్కించాడు. సినిమా హీరో విలన్ల మధ్య జరిగే మైండ్ గేం.. అయితే ఈ కాన్సెప్ట్ తో ఇదవరకు సినిమాలు వచ్చినా ఇది కూడా మరో కొత్త ఫీల్ తెస్తుంది.

ఇక కథనం మీద ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో దర్శకుడు పట్టు తప్పాడని అనిపిస్తుంది. సినిమాలో మెయిన్ గా రాసుకున్న క్యారక్టరైజేషన్ వరకు ఓకే కాని దానికి తగ్గ స్క్రీన్ ప్లే నడిపించలేదు. యాక్షన్ సీన్స్, మైండ్ గేం ప్లాన్స్ అంతా బాగున్నాయి. ఇక కొన్ని చోట్ల డైలాగ్స్ బాగా పేలాయి. 

సాయి ధరం తేజ్ రెగ్యులర్ ఇమేజ్ కు దూరంగా ఇందులో ఓ భాధ్యతాయుతమైన పౌరుడిగా చూపించాడు. మెగా అభిమానులకు తేజ్ ను ఇలా చూడటం కాస్త కొత్తగా అనిపించింది. అయితే సినిమా అంతా సీరియస్ మోడ్ లో తీసుకెళ్లేలా చేసి ఎంటర్టైన్మెంట్ మిస్ అయిన భావన వచ్చేలా చేసింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ కూడా రొటీన్ గా అనిపిస్తాయి. ఓవరాల్ గా తేజ్ చేసిన ఈ జవాన్ కెరియర్ లో తనకో ప్రత్యేకమైన సినిమా అని చెప్పొచ్చు.

నటన, సాంకేతికవర్గం :

జై పాత్రలో సాయి ధరం తేజ్ పరిణితి చెందిన నటన కనబరిచాడు. సినిమా సినిమాకు తనలో పరిణితి కనిపిస్తుంది. హీరోయిన్ మెహ్రీన్ కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమే అన్నట్టు కనిపిస్తుంది. సినిమాలో ఆమెకు అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కలేదు. అయినా అందంతో ఆకట్టుకుంది. సినిమాలో తేజ్ కు పోటీగా విలన్ ప్రసన్న నటించాడు. తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకున్నాడు ప్రసన్న. ఇక కోటా, నాగబాబు, సుబ్బరాజు, జయ ప్రకాశ్ లు ఎప్పటిలానే నటించి మెప్పించారు.

ఇక జవాన్ టెక్నికల్ టీం విషయానికొస్తే.. దర్శకుడు కథ విషయంలో కొత్త పాయింట్ రాసుకున్నా దాన్ని తెరకెక్కించడంలో కొద్దిగా అటు ఇటు అయ్యాడు. డైలాగ్స్ విషయంలో దర్శకుడికి మంచి మార్కులే పడ్డాయి. తమన్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. గుహన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే అయితే కొంత ట్రిం చేసి ఉన్నా బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఒక్కమాటలో :

సాయి ధరం తేజ్ జవాన్.. గట్టెక్కేసినట్టే..!



Related Post

సినిమా స‌మీక్ష