చిరు పక్కనే పవన్.. సైరాలో ఛాన్స్..!

November 23, 2017


img

పదేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై తన వీర ప్రతాపం చూపించిన మెగాస్టార్ చిరంజీవి ఖైది నంబర్ 150తో తన సత్తా ఏంటో చూపించాడు. ఇక ఆ సినిమా ఇచ్చిన జోష్ తో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా సైరా నరసింహారెడ్డి సినిమాకు సిద్ధమయ్యాడు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తాడంటూ ఓ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతుంది. మెగాస్టార్ పవర్ స్టార్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే మెగా ఫ్యాన్స్ ఉత్సాహం ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. సైరాలో ఓ 10 నిమిషాల పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఆ పాత్రకు ముందు వెంకటేష్ ను అనుకున్నారట. కాని ఫైనల్ గా ఆ పాత్రలో పవర్ స్టార్ ను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట. అది పవన్ ఓకే అంటే కనుక సైరాకు స్పెషల్ ఎట్రాక్షన్ వచ్చినట్టే.

డిసెంబర్ మొదటి వారం నుండి సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా టెస్ట్ షూట్ లో మంచి అవుట్ పుట్ వచ్చిందట. ఇక అదే ఉత్సాహంతో రెగ్యులర్ షెడ్యూల్ కు వెళ్లాలని చూస్తున్నారు చిత్రయూనిట్. 



Related Post

సినిమా స‌మీక్ష