బన్నితో కొరటాల శివ..!

November 23, 2017


img

రైటర్ గా హిట్లు కొట్టిన కొరటాల శివ దర్శకుడిగా మారాక సూపర్ హిట్లు కొడుతూ వచ్చాడు. ప్రభాస్ తో మిర్చి, మహేష్ తో శ్రీమంతుడు, ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్ హీరోల కెరియర్ లో మైల్ స్టోన్ మూవీస్ గా నిలిచేలా తన సినిమాలను అందించిన కొరటాల శివ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ డైరక్టర్ అని చెప్పొచ్చు. మహేష్ తో భరత్ అను నేను చేస్తున్న కొరటాల శివ ఆ సినిమా తర్వాత అసలైతే చరణ్ తో సినిమా చేయాల్సి ఉంది.

కాని ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం స్టైలిష్ స్టార్ తో బోయపాటి సినిమా ఉంటుందని తెలుస్తుంది. వక్కంతం వంశీ డైరక్షన్ లో నా పేరు సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ సినిమా పూర్తి కాగానే తెలుగు తమిళ బైలింగ్వల్ ప్లాన్ చేశాడు. కాని ఆ సినిమా కంటే ముందు కొరటాల సినిమా ఉంటుందని తెలుస్తుంది. చరణ్, ఎన్.టి.ఆర్ రాజమౌళి సినిమా తర్వాతే ఫ్రీ అయ్యే అవకాశాలు ఉన్నాయని బన్నితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు కొరటాల శివ. 



Related Post

సినిమా స‌మీక్ష