అఖిల్ కోసం సమంత..!

November 23, 2017


img

అక్కినేని యువ హీరో అఖిల్ విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా హలో. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ల్ళో కింగ్ నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. సినిమా టీజర్ లో స్టంట్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాయి. ఇక ఎలాగైనా సరే అఖిల్ కు హిట్ ఇచ్చే ఉద్దేశంతో నాగార్జున భారీగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో మరోసారి అక్కినేని ఫ్యామిలీ మొత్తం కనిపిస్తారట. 

ఇప్పటికే టీజర్ లోనే నాగార్జున వాయిస్ ఓవర్ వినిపించగా ఇప్పుడు సినిమాలో అక్కినేని కోడలు క్రేజీ హీరోయిన్ సమంత కూడా ఉంటుందని లేటెస్ట్ టాక్. మరిది కోసం వదిన సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనుందట. మనం డైరక్టర్ విక్రం కుమార్ అక్కినేని ఫ్యామిలీతో మరో మనం చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. మరి సినిమాకు ఇంత హంగామా చేస్తుండగా అఖిల్ హలో ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష