సంక్రాంతికి టచ్ చేయడం కన్ఫాం..!

November 22, 2017


img

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా రీసెంట్ గా వచ్చి సూపర్ హిట్ అందుకున్న సినిమా రాజా ది గ్రేట్. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మాస్ రాజా అభిమానులను అలరించింది. ఇక ఆ సినిమా తర్వాత విక్రం సిరి డైరక్షన్ లో రవితేజ చేస్తున్న సినిమా టచ్ చేసి చూడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపుకు వచ్చేసిందట. సినిమా రిలీజ్ ను సంక్రాంతికి ఫిక్స్ చేశారు దర్శక నిర్మాతలు.

మాస్ మహరాజ్ మరోసారి అండ్ కమర్షియల్ సినిమాగా వస్తుంది టచ్ చేసి చూడు రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మళ్లీ రవితేజ కు హిట్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు. ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో పవన్ అజ్ఞాతవాసి, బాలయ్య జైసింహా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు టచ్ చేసి చూడు కూడా రావడంతో పోటీ మరింత పెరగనుంది. మరి పండుగ సీజన్ కాబట్టి ఎంటర్టైనింగ్ యాస్పెక్ట్ లో వస్తున్న రవితేజ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష