నేను శైలజ కాంబో రిపీట్..!

November 22, 2017


img

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన సినిమా నేను శైలజ. ఆ సినిమాలో జత కట్టిన కీర్తి సురేష్ ఆ ఒక్క సినిమాతో తెలుగులో టాప్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటున్న అమ్మడు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసితో పాటుగా సావిత్రి బయోపిక్ లో నటిస్తుంది. తెలుగు తమిళ భాషల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ మరోసారి రామ్ తో కలిసి నటించబోతుందట. 

నక్కిన త్రినాధరావు డైరక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో రామ్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుందట. ఇప్పటికే త్రినాధరావు చేసిన నేను లోకల్ సినిమా సూపర్ హిట్ కాగా ఆ దర్శకుడి సినిమా అనగానే కీర్తి ఓకే చెప్పిందట. రీసెంట్ గా ఉన్నది ఒకటే జిందగి సినిమాతో అలరించిన రామ్ లవ్ స్టోరీతో రాబోతున్నాడట. నేను శైలజ కాంబోలో వచ్చే ఈ సినిమా మళ్లీ అదే రేంజ్ హిట్ సాధిస్తుందో లేదో చూడాలి.       



Related Post

సినిమా స‌మీక్ష