పాపం నిర్మాత..ఉరేసుకొన్నాడు

November 22, 2017


img

ప్రజలకు వినోదం పంచుతూ రెండున్నర గంటలపాటు ఊహాలోకంలో విహరింపజేసేవి సినిమాలు. కానీ సినీపరిశ్రమలో పనిచేస్తున్న వారి జీవితాలు సినిమాలలో అంత అందంగా, ఆనందంగా ఉండవనే సంగతి అందరికీ తెలుసు. ముఖ్యంగా చిన్న సినీ నిర్మాతల జీవితాలలో ట్రాజెడీ స్టోరీలె ఎక్కువ. 

అదే మరోసారి నిరూపిస్తూ నిర్మాత బి. అశోక్ కుమార్ (40) మంగళవారం రాత్రి చెన్నైలోని ఆర్కాడు రోడ్డులోని వల్సరవాకంలో గల తన నివాసంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సినీ నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చలేకపోవడంతో అప్పులు ఇచ్చినవారి ఒత్తిడి పెరిగిపోయింది. అది భరించలేక మానసికవేధనతో క్రుంగిపోయి నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకొన్నారు. సూడైద్ నోట్ లో అదే విషయం వ్రాసినట్లు తెలుస్తోంది. అయన ప్రముఖ దర్శకుడు, నటుడు శశికుమార్ కు దగ్గర బందువు అవుతారు. చెన్నై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.            



Related Post

సినిమా స‌మీక్ష