పెళ్లిచూపులు మ్యాజిక్ తో ఆ సినిమా..!

November 21, 2017


img

విజయ్ దేవరకొండ టాలెంట్ ఏంటో చూపించిన పెళ్లిచూపులు సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. తరుణ్ భాస్కర్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా రాజ్ కందుకూరి నిర్మించగా సురేష్ బాబు చేతుల్లో పడ్డాక ఆ సినిమాకు స్పెషల్ క్రేజ్ వచ్చింది. సినిమా రిలీజ్ కు ముందే ప్రివ్యూలతో సినిమాకు మంచి బజ్ ఏర్పడేలా చేశారు. ఇప్పుడు అదే మ్యాజిక్ ను శ్రీవిష్ణు నటించిన మెంటల్ మదిలో సినిమాకు ఫాలో అవుతున్నారట.

నివేథా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వివేక్ ఆత్రేయా డైరెక్ట్ చేస్తున్నారు. రాజ్ కందుకూరి నిర్మించిన ఈ మెంటల్ మదిలో సినిమాను కూడా సురేష్ బాబు రిలీజ్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సెలబ్రిటీస్ కు ప్రివ్యూలు ఎరేంజ్ చేస్తున్నారట. మీడియాకు రెండు రోజుల ముందే ప్రివ్యూ వేస్తారని తెలుస్తుంది. మరి పెళ్లిచూపులు మ్యాజిల్ రిపీట్ చేస్తున్న మెంటల్ మదిలో రిజల్ట్ లో కూడా అదే తరహా హిట్ సాధిస్తుందో లేదో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష