విలన్ గా మరోసారి..!

November 20, 2017


img

బోయపాటి శ్రీను సినిమాల్లో హీరోలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో విలన్లు కూడా అదే రేంజ్ లో ఉంటారు. హీరోగా కెరియర్ ముగిసింది అనుకున్న జగపతి బాబుకి విలన్ గా కొత్త లైఫ్ ఇచ్చాడు బోయపాటి శ్రీను. ఇక ఆ సినిమా నుండి జగపతి బాబు రేంజ్ ఏంటో అందరికి తెలిసిందే. ఆ తర్వాత సరైనోడులో ఆది పినిశెట్టిని కూడా విలన్ గా చూపించాడు బోయపాటి శ్రీను.

అయితే ఇప్పుడు మరో హీరోని విలన్ గా చూపించాలని ప్లాన్ చేస్తున్నాడట. మొదట హీరోగా ఆ తర్వాత విలన్ గా చేసి సక్సెస్ అందుకుని మళ్లీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న గోపిచంద్ ను బోయపాటి శ్రీను విలన్ గా మారుస్తున్నాడట. మహేష్ తో బోయపాటి తీసే సినిమాలో గోపిచంద్ విలన్ గా అయితే సినిమాకు అదనపు ఆకర్షణగా ఉంటుందని ఈ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం చర్చల దశల్లో ఉన్న ఈ సినిమా కన్ ఫాం అయితే కనుక గోపిచంద్ మళ్లీ విలన్ గా తన విశ్వరూపం చూపిస్తాడని చెప్పొచ్చు. 



Related Post

సినిమా స‌మీక్ష