మెగా ఫ్యామిలీ జవాన్ అతనే..!

November 20, 2017


img

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా బివిఎస్ రవి డైరక్షన్ లో వస్తున్న సినిమా జవాన్. డిసెంబర్ 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నిన్న జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో మెగా హీరో సాయి ధరం తేజ్ చిత్ర విషయాలతో పాటుగా తన మెగా ఫ్యామిలీకి చెందిన జవాన్ గురించి చెప్పుకొచ్చాడు. ప్రతి ఇంట్లో ఓ జవాన్ ఉంటాడు. నా ఫ్యామిలీకి జవాన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆయన చేస్తున్న కార్యక్రమాలకు చాలా మంచి గుర్తింపు వస్తుంది.. అందుకే ఆయనకు సెల్యూట్ అంటూ సాయి ధరం తేజ్ మాట్లాడాడు.

ప్రస్తుతం తాను ఈ పొజిషన్ లో ఉండేందుకు మెగాస్టార్, పవర్ స్టార్ కారణమని.. నా సినిమాకు ఇంతమంది అభిమానులు వస్తారనుకోలేదు. ఇంద్ర 175 డేస్ ఫంక్షన్ కు అభిమానులు చూసి నాకు ఇలాంటి అభిమానులు వస్తా అని అనిపించేదని.. కాని సినిమాల్లోకి వచ్చాక మీ అభిమానం చూసి సంతోషంగా ఉందని అన్నారు. మెహ్రీన్ గోల్డెన్ లెగ్ అని కచ్చితంగా ఈ సినిమా హిట్ కొడతాం అంటూ ఉత్సాహంగా మాట్లాడాడు సాయి ధరం తేజ్. 



Related Post

సినిమా స‌మీక్ష