నాగ్ సినిమా.. వర్మ మొదలుపెట్టాడు..!

November 20, 2017


img

సినిమా ప్రమోషన్స్ లో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఎంతమంది ఎంత కొత్తగా ఆలోచించినా సంచలన దర్శకుడు వర్మలా ఆలోచించడం కష్టమే. నిన్నటిదాకా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అంటూ నానా రచ్చ చేసిన వర్మ ఫైనల్ గా నాగార్జునతో సినిమా మొదలు పెట్టాడు. ఈరోజు ముహుర్తపు షాట్ చేస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ స్టార్ట్ అంటూ సినిమా థీం ఏంటో చెబుతూ ఓ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు వర్మ.

ఓ టేబుల్ మీద గన్, పోలీస్ క్యాప్, గాగుల్స్, వర్మ సిగ్నేచర్ అయిన టీ గ్లాస్ ఇలా ఓ ప్రీ లుక్ తో వర్మ తన సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత వర్మతో నాగార్జున సినిమా తెరకెక్కుతుంది. సినిమాలో నాగ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. మరి శివ లాంటి సినిమా తీసిన ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.

దర్శక నిర్మాతగా వర్మ నాగార్జున సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. మరి ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి. ఈరోజు నుండి రెగ్యులర్ షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా 2018 సమ్మర్ లో రిలీజ్ చేస్తారని టాక్.



Related Post

సినిమా స‌మీక్ష