ఖాకి రివ్యూ & రేటింగ్

November 17, 2017


img

రేటింగ్ : 2.75/5

కథ :

సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ధీరజ్ (కార్తి) డిఎస్పిగా చార్జ్ తీసుకున్న వెంటనే ఓ దొంగల ముఠాకి సంబందించిన కేసుని టేకప్ చేస్తాడు. ఎలాంటి కేసునైనా ఈజీగా సాల్వ్ చేసే ధీరజ్ దొంగల ముఠా కేసు ఇబ్బందుల్లో పడేస్తుంది. అయినా సరే ఆ కేస్ టేకప్ చేసి వారి అంతు చూడాలని నిర్ణయించుకుంటారు. హాపీగా లైఫ్ కొనసాగిస్తున్న సందర్భంలో రిస్క్ లో పడతాడు. అంతేకాదు దొంగల ముఠా వేసిన ప్లాన్ తెలుసుకుని షాక్ అవుతాడు. ఇక దొంగల ముఠాను ధీరజ్ ఎలా మట్టుపెట్టాడు. దాని వెనుక ఉన్న వాళ్లను ఎలా పట్టుకున్నాడు అన్నది ఖాకి కథ.

విశ్లేషణ :

ఖాకి అనగానే పోలీస్ బ్యాక్ డ్రాప్ కథ అని తెలుస్తుంది. అయితే రెగ్యులర్ పోలీస్ సినిమాల్లా కాకుండా ఇది సహజంగా తెరకెక్కించాడు. కార్తికి ఉన్న ది గాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది. కథ రాసుకోవడమే కాదు దానిమీద దర్శకుడు రీసర్చ్ చేశాడని చెప్పొచ్చు. ఆకట్టుకునే కథనం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. 

అయితే సినిమాలో సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. సినిమా అంతా ఎంగేజింగ్ గా తీసినా అక్కడక్కడ బోర్ ఫీలింగ్ రాక తప్పదు. ఇక రకుల్ లాంటి స్టార్ హీరోయిన్ ను కేవలం రెండు మూడు సీన్స్ కే పరిమితం చేశారని అనిపిస్తుంది. సినిమాలో కార్తి మాత్రం తన పర్ఫెక్షన్ చాటుకున్నాడు. ట్రైలర్, టీజర్ లో చూపించిన విధంగా సినిమా ఆకట్టుకుంది.

ఇక సినిమాలో పోలీస్ విధివిధానాలు.. దొంగల ముఠా ఎలా ఉంటుంది అన్న విషయాల మీద డీటేల్డ్ గా చెప్పారు. కార్తి ఇమేజ్ కు దూరంగా సినిమా సాగుతుందని అనిపిస్తుంది. పవర్ ఫుల్ పోలీస్ కథగా వచ్చిన ఖాకి తెలుగు ప్రేక్షకులు రెగ్యులర్ గా చూసే పోలీస్ సినిమాల్లా కాకుండా కాస్త కొత్తగా ఉంటుంది. 

నటన, సాంకేతికవర్గం :

కార్తి ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నాడు. పోలీస్ గా తన పవర్ ఏంటో చూపించాడు. యాక్షన్ సీన్స్ కూడా కార్తి ఆకట్టుకున్నాడు. ఇక రకుల్ ఉన్నంతసేపు అలరించింది. సినిమాలో రకుల్ లో రొమాంటిక్ యాంగిల్ చూడొచ్చు. విలన్ గా అభిమన్యు సింగ్ నటన ఆకట్టుకుంది. దొంగల ముఠా మెయింటైన్ చేసే వాడిగా అతని కాస్టూంస్, లుక్ బాగుంది. ఇక మిగతా వారంతా పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఖాకి టెక్నికల్ టీం విషయానికొస్తే.. దర్శకుడు వినోద్ సినిమాలో సహజత్వానికి పెద్ద పీఠ వేశాడు. కథ కథనంలో దర్శకుడు తన మార్క్ చూపించాడు. సత్యన్ సూర్యన్  కెమెరా వర్క్ సినిమాకు పెద్ద అసెట్. గిబ్రాన్ మ్యూజిక్ పాటలు బాగా లేకున్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టింది. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ కాస్త ట్రిం చేసి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఒక్కమాటలో :

కార్తి ఖాకి పోలీస్ పవర్ చూపించే సినిమా..!


Related Post

సినిమా స‌మీక్ష