ఒక్కడు మిగిలాడు రివ్యూ & రేటింగ్

November 10, 2017


img

రేటింగ్ : 2/5

కథ :

స్టూడెంట్ లీడర్ గా ఉన్న సూర్య (మంచు మనోజ్) అదే కాలేజ్ లో ముగ్గురు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోగా దాని మీద ఉద్యమానికి దిగుతాడు. సూర్య చేసే పనులు నచ్చని మినిస్టర్ అతన్ని ఎన్ కౌంటర్ చేయించాలని చూస్తాడు. ఇక ఇంతలోనే అసలు అతని ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. పీటర్ గా శ్రీలంక శరనార్ధులను కాపాడేందుకు కృషి చేస్తాడు. అసలు ఇంతకీ పీటర్ ఎవరు..? సూర్య మినిస్టర్ నుండి ఎలా తప్పించుకున్నాడు..? అన్నది అసలు కథ.

విశ్లేషణ :

దర్శకుడు అజయ్ రాసుకున్న కథ చాలా బాగుంది. అయితే శ్రీలంక శరణార్ధుల గురించి ఇదవరకే తమిళంలో రెండు మూడు సినిమాలు వచ్చాయి. వాటిలో కేవలం సినిమాలో ఆ అంశాన్ని తేలిగ్గా చూపించేశారు. అయితే ఇందులో ఒక్కడు మిగిలాడులో డీటేల్డ్ గా చెప్పాలని చూసినా కొన్ని సీన్స్ తప్ప మిగతా అంతా సాగదీసినట్టు అనిపిస్తుంది. 

చెప్పాలనుకున్న కథ ఎలాంటిదైనా సరే ఎంటర్టైనింగ్ గా చెప్పొచ్చు కాని కేవలం ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ గా సినిమాను సాగించడం వల్ల సినిమా అంతా సీరియస్ గా అనిపిస్తుంది. ఎంచుకున్న కథ మంచిదే అయినా సినిమా చూసే ఆడియెన్స్ ను ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతుంది అన్నది ఆలోచించాలి. కొన్ని సీన్స్ డైలాగ్స్ బాగా వచ్చాయి. ఎల్టిటిఈ ప్రభాకరన్ స్పూర్తిగా రాసుకున్న పీటర్ పాత్ర అనుకున్నంత పడలేదు.

సెకండ్ హాఫ్ లో సముద్రం సీన్ లో కొంత బాగా అనిపించినా అది కూడా నిడివి ఎక్కువవడం వల్ల బోర్ ఫీలింగ్ వస్తుంది. సినిమా మొదలు పెట్టిన విధానంతో పోల్చితే క్లైమాక్స్ కాస్త నిరాశ పరుస్తుంది. యాక్షన్ పార్ట్ కూడా కాస్త ఎక్కువైనట్టు అనిపిస్తుంది. మొత్తానికి మంచు అభిమానులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉన్నా సగటు సిని అభిమానికి మాత్రం నచ్చకపోవచ్చు.

నటన, సాంకేతికవర్గం :

మంచు మనోజ్ మరోసారి తన నటనా ప్రతిభను కనబరిచాడు. సినిమా అంతా సీరియస్ మోడ్ లో నటించి మంచి మార్కులే కొట్టేశాడు మనోజ్. సినిమాలో రెండు పాత్రలకు తగిన న్యాయం చేశాడు. అయితే సినిమాలో తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ఆశించిన వారికి నిరాశ మిగిల్చాడు. హీరోయిన్ అనీషా అంబ్రోస్ పర్వాలేదు. విలన్ గా డైరక్టర్ అజయ్ అలరించాడు. ఓవిధంగా చెప్పాలంటే ఈ పాత్ర కాస్త హీరో పాత్రని కూడా డామినేట్ చేసిందని చెప్పొచ్చు. పోసాని చేసిన సిన్సియర్ పోలీస్ పాత్ర ఆకట్టుకుంది. సుహాసిని, బెనర్జీ పాత్రలు అలరించాయి.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. శివ నందిగాం సాంగ్ పర్వాలేదు. బిట్ సాంగ్స్ కాబట్టి సినిమా సందర్భానికి తగ్గట్టు ఆకట్టుకున్నాయి. రామరాజు కెమెరా వర్క్ బాగుంది. సినిమాలో అతని కష్టం కనిపిస్తుంది. డైరక్టర్ అజయ్ తన ప్రతిభ కనబరిచాడు. అయితే సినిమాను మరి రియలిస్టిక్ అన్న విధంగా తెరకెక్కించే ప్రయత్నంలో గాడి తప్పాడు. కథ బాగున్నా దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే లేదు. ఆ విషయంలో దర్శకుడు విఫలమయ్యాడని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు కావాల్సినంత పెట్టారు. కాకపోతే కొన్ని చోట్ల కాంప్రమైజ్ అయినట్టు తెలుస్తుంది.

ఒక్కమాటలో : 

మంచు హీరో మంచి ప్రయత్నమే కాని ఎమోషనల్ డ్రామా ఎక్కువయ్యేసరికి ప్రేక్షకులు నిరాశ చెందక తప్పదు.



Related Post

సినిమా స‌మీక్ష