అదిరింది రివ్యూ & రేటింగ్

November 09, 2017


img

రేటింగ్ : 2.5/5

కథ : 

భార్గవ్ (విజయ్) డాక్టర్ గా పేదలకు 5 రూపాయలతోనే మెరుగైన వైద్యం అందిస్తుంటాడు. ఓ పక్క తను ప్రాణాలను కాపాడుతూ మరో పక్క వైద్య వృత్తిలోనే దుర్మార్గాలకు పాల్పడిన వారి పని పడుతుంటాడు. ఈ క్రమంలో భార్గవ్ డాక్టర్ గానే కాదు మ్యుజిషియన్ గా కూడా కనిపిస్తాడు. రెండిటితో తన టార్గెట్ రీచ్ అయ్యే పనిలో ఉంటాడు. ఫైనల్ గా విజయ్ భార్గవ్ అసలు టార్గెట్ డానియెల్ (ఎస్.జె.సూర్య) అని తెలుస్తుంది. అసలు ఇంతకీ విజయ్ భార్గవ్ ఒకడేనా..? అతనికి డానియల్ కు ఉన్న పగ ఏంటి..? అన్నది అసలు కథ.

విశ్లేషణ :

కొద్దిరోజులుగా దేశమంతా సంచలనంగా మారిన సినిమా మెర్సల్ కు డబ్బింగ్ వర్షన్ గా వచ్చింది ఈ అదిరింది. సినిమాలో హీరో డాక్టర్స్ ను టార్గెట్ చేశాడు అది నిజమే. ఇక కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగులు ఉన్నాయి. అయితే వాటిని మ్యూట్ చేసేశారు. ఇక గవర్నమెంట్ హాస్పిటల్స్ పై డైలాగ్స్ బాగున్నాయి.

కథ కథనాలు ఠాగూర్, భారతీయుడు సినిమాలను గుర్తుచేస్తాయి. ఇలాంటి సినిమాలు ఇదవరకే చూశామన్న ఫీలింగ్ రాక మానదు. అయితే మొదటి భాగం స్పీడ్ గా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ సాగదీశాడని చెప్పాలి. కథనమ నెమ్మదించిందని స్పష్టంగా తెలుస్తుంది. 

అయితే తమిళంలో విజయ్ ఫాలోయింగ్ భారీగా ఉంటుంది కాబట్టి చెల్లిపోతుంది. తెలుగులో కొంతమేరకు పర్వాలేదు కాని విజయ్ తమిళనాట చేసిన హంగామా అయితే తెలుగులో అదిరింది కష్టమని చెప్పొచ్చు. హీరోయిన్స్ పాత్రలు కేవలం పాటలకే అన్నట్టు ఉంటుంది. కామెడీ ఓకే.. కథనం ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కాస్త బోర్ కొట్టిస్తాయి.  

నటన, సాంకేతికవర్గం :

విజయ్ ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో అలరించాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో దళపతి పాత్ర భాగుంటుంది. అయితే ఆ పాత్ర సెకండ్ హాఫ్ లో వచ్చిన వెంటనే బాగుంది అనిపించినా సాగదీసే సరికి బోర్ కొట్టేస్తుంది. ఇక హీరోయిన్స్ లో నిత్యా మీనన్ కు మంచి పాత్ర దొరికింది. సమంత, కాజల్ జస్ట్ పాత్రలు చేశారంతే. ఇక విలన్ గా నటించిన సూర్య మాత్రం అదరగొట్టాడు. విజయ్ తర్వాత అతని పాత్ర హైలెట్ అని చెప్పొచ్చు. సత్యరాజ్ కూడా తగిన పాత్రలో అలరించాడు. వడివేలు చాలా రోజుల తర్వాత నవ్వించాడు.

ఇక సినిమా టెక్నికల్ టీం విషయానికొస్తే.. దర్శకుడు అట్లీ తమిళంలో విజయ్ కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా కథ అల్లుకున్నాడు. పక్కా కమర్షియల్ పంథాలో అండర్ కవర్ మెసేజ్ కూడా ఉంది కాబట్టి అక్కడ బంపర్ హిట్ అయ్యింది. అయితే విజయ్ ఇక్కడ సగటు హీరో.. ఏమాత్రం క్రేజ్ లేదు కాబట్టి సోసోగానే ఆడుతుంది. విష్ణు సినిమాటోగ్రఫీ బాగుంది. రెహమాన్ సాంగ్స్ కన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ కాస్త ట్రిం చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఒక్కమాటలో :

అదిరింది విజయ్.. స్లోగా నడిపించినా అదరగొట్టింది.



Related Post

సినిమా స‌మీక్ష