వాళ్లే నిజమైన సూపర్ స్టార్స్..!

September 25, 2017


img

స్పైడర్ గా మహేష్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ రజిని, చిరంజీవిల గురించి సంచనల వ్యాఖ్యలు చేశాడు. దేశంలో చాలా పెద్ద స్టార్స్ ఉన్నారన్న మహేష్ చిరు, రజినిలు నిజమైన సూపర్ స్టార్స్ అని అన్నారు.

వారు ఎలాంటి సినిమా చేసినా ప్రేక్షకులు థియేటర్ కు వస్తారని.. ఇక నటుడు, స్టార్ కన్నా సినిమా చాలా పెద్దదని అన్నారు. తనకు వచ్చిన సూపర్ స్టార్ ఇమేజ్ గురించి తాను పెద్ద ఆలోచించనని అన్నారు. ఇక స్పైడర్ తో తమిళ నాట కూడా మార్కెట్ పెంచుకునే ఆలోచనలో ఉన్న మహేష్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష