లక్ష్మిస్ ఎన్.టి.ఆర్ ప్రొడ్యూస్ అతనే..!

September 25, 2017


img

వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తున్న సంచలన దర్శకుడు వర్మ ఈమధ్య మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఎన్.టి.ఆర్ జీవిత చరిత్రతో ఆయన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అంటూ ఓ సినిమాకు శ్రీకారం చుట్టాడు. అయితే ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నచ్చలేదు. అందుకే వారు వర్మను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇక ఈ సినిమా శశికళ సినిమాలానే అటకెక్కుతుందని భావించగా ఇప్పుడు ఆ సినిమా నిర్మాతను ఎనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు వర్మ.

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాను ప్రముఖ దర్శకుడు హీరో జె.డి.చక్రవర్తి నిర్మిస్తారని టాక్. వివాదానికి దారితీసేలా రాబోతున్న ఈ సినిమా ఆదిలోనే ఎన్నో అవాంతరాలను ఎదుర్కుంటుంది అలాంటిది ఈ సినిమా వస్తే ఇంకా ఎలాంటి గొడవలను తీసుకొస్తుందో చూడాలి. ఈమధ్యనే మళ్ళీ తెర మీద కనిపించిన జెడి చక్రవర్తి నిర్మాతగా ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష