రంగస్థలం ఐటం సాంగ్ ఎవరితో అంటే..!

September 25, 2017


img

సుకుమార్ రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ రంగస్థలం 1985. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అదిరిపోయే ఐటం సాంగ్ ఉంటుందట. ఈ సాంగ్ లో బాలీవుడ్ భామలను నర్తింప చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ప్రస్తుతం ప్రియాంకా చోప్రా కాని, కరీనా కపూర్ కాని రంగస్థలం 1985లో ఐటం సాంగ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కరీనానే ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట. సుక్కు, దేవి సినిమాల్లో ఐటం సాంగ్ అది కూడా రాం చరణ్ హీరోగా కాబట్టి ఇక ఆ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుంది అన్నది ఊహించేసుకోవచ్చు. మరి ఈ సాంగ్ సినిమాకు ఏమాత్రం ప్లస్ అవుతుందో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష