బిగ్ బాస్ విన్నర్ శివ బాలాజి..!

September 25, 2017


img

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ మాలో నిర్వహించిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఈ షో ఎలా ఉంటుంది అన్న ఆలోచనలన్నిటిని పటా పంచలు చేస్తూ షో సక్సెస్ అయ్యిందని చెప్పాలి. ఇక నిన్న జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ఫైనల్ విజేతను ఎనౌన్స్ చేశారు తారక్. అందరు అనుకున్నట్టుగానే శివ బాలాజి బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ అయ్యాడు.

14 మంది కంటెస్టంట్స్ తో మొదలైన బిగ్ బాస్ షో మధ్యలో దీక్షా పంథ్, నవదీప్ ల వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎంటర్టైన్ చేశారు. ఇక ఫైనల్ గా మిగిలిన 5 మంది సభ్యులలో అర్చన, హరితేజ, నవదీప్ లు ఎలిమినేట్ అవగా ఫైనల్ పోటీలో ఆదర్శ్, శివ బాలాజి ఉన్నారు. ఇక వారిద్దరిలో శివ బాలాజి బిగ్ బాస్ సీజన్ 1 విజేతగా ఎనౌన్స్ చేశారు.

ఇద్దరి మధ్య కేవలం 5 నుండ్ 8 లక్షల ఓట్ల తేడానే ఉందని తారక్ వెళ్లడించాడు. ఇక ఇప్పటిదాకా రావడమే గొప్ప అనుకున్న ఆదర్శ్ మాటలు ఆకట్టుకోగా ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు సింపుల్ గా థ్యాంక్స్ అని చెప్పాడు శివ బాలాజి. ఇక అనుకున్న విధంగా బిగ్ బాస్ షీల్డ్ తో పాటుగా ప్రైజ్ మనీ కూడా అందించారు. 



Related Post

సినిమా స‌మీక్ష