నానితో అనుపమా ఫిక్స్..!

September 23, 2017


img

నాచురల్ స్టార్ నాని మేర్లపాక గాంధి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కృష్ణార్జున యుద్ధం. నిన్నుకోరి హిట్ తో తన కెరియర్ లో మరింత జోష్ నింపుకున్న నాని ప్రస్తుతం ఎం.సి.ఏ సినిమాలో నటిస్తున్నాడు. వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మేర్లపాక గాంధి సినిమాలో నటించబోతున్నాడు. 

ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను సెలెక్ట్ చేశారట. అఆ, ప్రేమం సినిమాలతో హిట్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ నానితో చేస్తున్న మొదటి సినిమా ఇది. చూడచక్కని రూపంతో పాటుగా అభినయంలో కూడా అదరగొడుతున్న అనుపమ నాని పక్కన ఛాన్స్ కొట్టెయడం ఓ విధంగా లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. మరి ఈ అవకాశాన్ని అనుపమ ఎలా ఉపయోగించుకుందో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష