యూఎస్ లో ఎన్.టి.ఆర్ దుమ్ముదులిపేశాడు..!

September 23, 2017


img

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వచ్చిన జై లవ కుశ రిలీజ్ నుండి సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. సినిమా నుండి డివైడ్ టాక్ వచ్చినా సరే కలక్షన్స్ మాత్రం అదరగొడుతున్నాయి. ఇక ఓవర్సీస్ లో ముఖ్యంగా యూఎస్ లో ఈ సినిమా 1 మిలియన్ క్రాస్ చేసి ఎన్.టి.ఆర్ స్టామినా ప్రూవ్ చేసింది. జై లవ కుశలుగా మూడు పాత్రల్లో ఎన్.టి.ఆర్ నట వీరంగం ఫ్యాన్స్ కు నచ్చేసింది. 

190 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఈ జై లవ కుశ ప్రీమియర్స్ తోనే బాక్సాఫీస్ బద్ధలు కొట్టెసింది. బాబి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి కళ్యాణ్ రాం నిర్మించారు. రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. సినిమా రేంజ్ చూపేలా కలక్షన్స్ కూడా మంచి వసూళ్లను రాబడుతున్నాయి. 


Related Post

సినిమా స‌మీక్ష