డేరాబాబాతో రాఖీ సావంత్ ఐటెం సాంగ్?

September 22, 2017


img

ప్రస్తుతం జైల్లో ఉన్న గుర్మీత్ రాం రహీం సింగ్ లీలలు రోజుకొకటి చొప్పున ఒకటొకటిచొప్పున మెల్లగా బయటపడుతున్నాయి. వాటిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇంత స్పైసీ స్టోరీపై రామ్ గోపాల్ వర్మ దృష్టి ఎందుకు పడలేదో తెలియదు కానీ ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని అతనిపై ఒక సినిమా మొదలుపెట్టేసింది. బాబా పెంపుడు కూతురుగా చెప్పుకొంటూ చాటుగా అతనితో శృంగారం సాగించిన హనీప్రీత్ సింగ్ పాత్రను రాఖీ సావంత్ చేస్తోంది. శృంగార తార అయిన రాఖీ సావంత్ తనకు సరైన పాత్ర అదేనని భావించడం సహజమే కనుక ఆమె ఆ పాత్రను అద్భుతంగా రక్తి కట్టించడం ఖాయం. హిందీలో తీస్తున్న ఈ సినిమాకు ‘అబ్ హోగా ఇన్సాఫ్’ (ఇప్పుడు న్యాయం జరుగుతుంది) అనే టైటిల్ ఇచ్చారు. డిల్లీలో డేరా సచ్చా సౌధా ఆశ్రమం సెట్ వేసి దానిలో అప్పుడే షూటింగ్ మొదలుపెట్టేసింది కూడా. మొట్టమొదటగా డేరాబాబా, హనీప్రీత్ సింగ్ లపై ఒక ఐటెం సాంగ్ చిత్రీకరించడం విశేషం. ఈ సినిమాకు రాఖీ సావంత్ తమ్ముడు రాఖేష్ దర్శకత్వం వహిస్తుండటం మరో విశేషం. ఈ సినిమాతో డేరాబాబా, హనీప్రీత్ సింగ్ ల అసలు రూపం బయటపెడతానని రాఖీ సావంత్ చెప్పారు. తనకు హనీ ప్రీత్ సింగ్ తో గత 7-8 ఏళ్ళుగా మంచి పరిచయమే ఉందని కనుక ఆమె వ్యక్తిగత విషయాలతో సహా ఆమెగురించి అన్నీ తనకు తెలుసునని అందుకే ఈ పాత్రను ఎంచుకొని చేస్తున్నానని రాఖీ సావంత్ తెలిపారు. ఈ సినిమాను 2017, డిశంబర్ లో విడుదల చేయాలనుకొంటున్నట్లు చెప్పారు. 

ఈ సందర్భంగా రాఖీ సావంత్ మరొక షాకింగ్ న్యూస్ కూడా చెప్పారు. “అందరూ అనుకొంటున్నట్లుగా హనీప్రీత్ సింగ్ ఇప్పుడు నేపాల్ లో లేదు లండన్ లో ఉంది,” అని చెప్పారు.  గుర్మీత్ సింగ్ తనే హీరోగా కొన్ని సినిమాలు తీసుకొన్నాడు. కానీ ఇప్పుడు అతని నిజజీవిత కధ ఆధారంగా అతనిపైనే ఇటువంటి సినిమా ఒకటి వస్తుందని పాపం ఎన్నడూ ఊహించి ఉండడు. కనుక రాఖీ సావంత్ ఈ సినిమాను పూర్తి చేసిన తరువాత దానిని రోహతక్ జైల్లో ఉన్న గుర్మీత్ కు కూడా ఒకసారి చూపిస్తే సంతోషిస్తాడు.   


Related Post

సినిమా స‌మీక్ష