దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా వచ్చిన ఆ సినిమా అప్పటికి ఉన్న రికార్డులను చెరిపేసింది. ఇక ఆ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వ ప్రతిభ అందరిని ఆకర్షించింది. మగధీర తర్వాత రాం చరణ్ తో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. అఫ్కోర్స్ బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా అంటే చరణ్ కూడా వెయిట్ చేసే రేంజ్ కు వెళ్లాడనుకోండి.
బాహుబలి తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తాడు అన్న విషయం గమనిస్తే అది కచ్చితంగా చరణ్ తోనే అని తెలుస్తుంది. దీని కారణం రాజమౌళి చరణ్ లు తరచు కలవడమే.. సైరా నరసింహారెడ్డి పోస్టర్ లాంచింగ్ కు రాజమౌళి రాగా శ్రీవల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చరణ్ వెళ్లాడు. ఇక అదేదో పిలిచారు కాబట్టి వెళ్లారు అనుకుంటే రాం చరణ్ రంగస్థలం షూటింగ్ స్పాట్ కు రాజమౌళి వెళ్లడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కచ్చితంగా రాజమౌళి తన తర్వాత సినిమా చరణ్ తోనే చేసే అవకాశాలున్నాయట. జక్కన్న ఓకే అంటే కొరటాల శివ సినిమా కన్నా ముందు రాజమౌళి సినిమానే చేస్తాడని తెలుస్తుంది. మరి మగధీర కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.