ఆ హీరోయిన్ డేట్స్ ఖాళీలేవట..!

September 21, 2017


img

మలయాళ భామలకు తెలుగులో ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. ఇక అందులోనూ నేను శైలజ, నేను లోకల్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్న కీర్తి సురేష్ అంటే ఇక్కడ సూపర్ క్రేజ్. చేసిన రెండు సినిమాలతోనే అమ్మడు స్టార్ రేంజ్ కు వెళ్లిందంటే నమ్మాలి. తెలుగులోనే కాదు తమిళంలో కూడా కీర్తి సురేష్ టాప్ హీరోయిన్ గా అవకాశాలను అందుకుంటుంది.

సమంత పెళ్లి పనుల్లో బిజీ అవడం వల్ల అమ్మడికి ఇంకా ప్లస్ అయ్యింది. తమిళ తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు వెళ్తే వచ్చే ఏడాది దాకా ఖాళీలేవని చెబుతుందట. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని అమ్మడు వచ్చిన అవకాశాలన్నిటిని ఓకే చేస్తుంది. ఇక స్టార్స్ సినిమాలనైతే అసలు మిస్ అవ్వట్లేదట. అందుకే స్టార్స్ ఆమె డేట్స్ పరంగా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ రేంజ్ లో క్రేజ్ వచ్చిన కీర్తి రెమ్యునరేషన్ పెంచకుండా ఉంటుందా. ప్రస్తుతం 1.5 కోట్లు వసూళు చేస్తున్న కీర్తి త్వరలోనే 2 లేదా 2.5 కోట్లు డిమాండ్ చేయాలని నిర్ణయించుకుందట. 



Related Post

సినిమా స‌మీక్ష