జై లవ కుశ రివ్యూ & రేటింగ్

September 21, 2017


img

రేటింగ్ : 3/5

కథ :  

ముగ్గురు కవలలుగా ఉండే జై లవ కుశలలో జై కాస్త నత్తి మాట్లాడుతుంటాడు. ఇక లవ కుశలు ఇద్దరు నాటకాలు వేస్తుంటే జై మాత్రం వారికి టీ టిఫిన్ లు అందితూ స్టేజ్ వెనుకే ఉండిపోతాడు. జై లవ కుశల మామ పోసాని జైని మరి హీనంగా చూస్తాడు. లవ కుశలు కూడా జై ని అవమానిస్తారు. అందుకే ఓ నాటక సమయంలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యేలా చేస్తాడు జై. ఇక ఎవరికి వారు దూరమై 20 ఏళ్ల తర్వాత పెద్ద వారవుతారు. అందరికంటే చిన్నవాడు లవ బ్యాంక్ మేనేజర్ అవగా.. కుశ దొంగగా మారతాడు.. ఇక జై మాత్రం బైరంపూర్ లో రావణుడిగా అక్కడ వారిని అందరిని వణికిస్తుంటాడు. లవ సమస్యలలో ఉండగా అనుకోకుండా కుశ కలిసి తన సమస్యలను ఇంకా ఎక్కువ చేస్తాడు. ఇక లవ కుశలను సాయి కుమార్ కిడ్నాప్ చేసి జై దగ్గరకు తీసుకొస్తాడు. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్. తన రాజకీయ ఎత్తుగడకు లవ కుశలను వాడాలని డిసైడ్ అయిన రావణ తమ్ముళ్లిద్దరికి చెరో పని అప్పచెబుతాడు. ఇంతకీ జై లవ కుశ చాలా రోజుల తర్వాత కలుసుకుని ఎలా ఉన్నారు. వారి మధ్య సాన్నిహిత్యం ఎలా సాగింది. తమ్ముళ్ల మీద కోపంతో జై ఏం చేశాడు అన్నది అసలు కథ.

విశ్లేషణ : 

అంచనాలకు తగ్గట్టుగానే బాబి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా మొత్తం ఎన్.టి.ఆర్ నడిపించాడు. ముఖ్యంగా ఇంటర్వల్ నుండి సాగే జై నట విశ్వరూపం అంతా ఇంతా కాదు. సినిమాలో జై పాత్రే హైలెట్. ఏమాత్రం తగ్గకుండా తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు తారక్. ఇక సినిమా మొదటి భాగం లవ కుశలతో నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ మొత్తం జై లవ కుశ ముగ్గురి మీద నడిపించాడు.

సినిమాలో కథ దాని చుట్టూ అల్లుకున్న కథనం అంతటా ఉత్కంఠతతో ఉంటుంది. ఎన్.టి.ఆర్ మనసు పెట్టి చేశాడని చెబుతున్న మాట వాస్తవమని సినిమా చూస్తే అర్ధమవుతుంది. అయితే లాజిక్ లను ఆలోచిస్తే మాత్రం సినిమా నచ్చే అవకాశం ఉండదు. ఇక కొన్ని పాత్రలను అర్ధాంతరంగా ముగించేశాడు దర్శకుడు అది కూడా కాస్త నిరుత్సాహ పరుస్తుంది. ఓవరాల్ గా సినిమా ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కు పండుగ లాంటి సినిమా అని చెప్పొచ్చు. జై లవ కుశ మూడు పాత్రల్లో ఎన్.టి.ఆర్ ఇరగదీశాడు.  

నటన, సాంకేతిక వర్గం : 

ఎన్.టి.ఆర్ నట విశ్వరూపంతో వచ్చిన ఈ సినిమా జై లవ కుశ అని చెప్పాలి. జై గా ఎన్.టి.ఆర్ డైలాగ్స్ థియేటర్స్ లో విజిల్స్ మోత మోగిస్తాయి. జై మాత్రమే కాదు లవ కుశలుగా ఎన్.టి.ఆర్ చాలా గొప్ప పరిణితి గల నటనను ప్రదర్శించాడు. ప్రతి ఎన్.టి.ఆర్ అభిమాని గొప్పగా చెప్పుకునే సినిమా చేశాడు తారక్. ఇక రాశి ఖన్నా, నివేథా థామస్ లు కూడా పర్వాలేదు అనిపించారు. సాయి కుమార్ కూడా బాగా నటించాడు. పోసాని తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. మిగతా పాత్రలన్ని చక్కగా కుదిరినట్టు ఉన్నారు.

టెక్నికల్ విషయాల గురించి ప్రస్తావిస్తే.. సినిమాకు కెమెరామన్ చోటా కె నాయుడు సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తెర మీద తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ మూడు పాత్రలకు ఎంత కష్టపడ్డాడో చోటా కూడా అంతే కష్టపడి ఉంటాడని చెప్పొచ్చు. ఇక మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాద్ కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. డైలాగ్స్ అదరగొట్టగా వాటిని ఎన్.టి.ఆర్ పలికించిన తీరు అద్భుతమని చెప్పాలి. ఎడిటింగ్ ఓకే సెకండ్ హాఫ్ కాస్త అక్కడక్కడ స్పీడ్ తగ్గిందని అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సినిమాకు ఎంత కావాలో అంత పెట్టేశారు.  

ఒక్కమాటలో : 

తారక్ నట విశ్వరూపంతో వచ్చిన జై లవ కుశ నందమూరి ఫ్యాన్స్ కు సిని అభిమానులకు నచ్చే సినిమా అని ముక్త కంఠంతో చెప్పొచ్చు.



Related Post

సినిమా స‌మీక్ష