ఘట్టమనేని ఫ్యామిలీ కోసం స్పైడర్..!

September 20, 2017


img

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ ఈ నెల 27న రిలీజ్ అవుతుంది. మహేష్ స్పై ఏజెంట్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. 120 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షోను ఘట్టమనేని ఫ్యామిలీ మొత్తం చూస్తున్నారట. కృష్ణ, విజయ నిర్మల మాత్రమే కాదు మహేష్ అక్కలు, బావలు.. అన్న, వదిన, పిల్లలు అంతా ఈ శని ఆదివారాల్లో ప్రీమియర్ షో చూస్తారట. 

ఇక తమిళంలో కూడా భారీస్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా అక్కడ స్టార్స్ ను పిలిచి ప్రీమియర్ షోస్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారట. తప్పకుండా సినిమా అంచనాలను అందుకునేలా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేయగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది. మరి ఈ సంచలనాలన్ని రిలీజ్ తర్వాత కూడా కొనసాగుతాయో లేదో చూడాలి.  



Related Post

సినిమా స‌మీక్ష