రంగస్థలంలో చిరంజీవి..!

September 20, 2017


img

మెగాస్టార్ చిరంజీవి రంగస్థలంలో నటిస్తున్నారా అన్న కన్ ఫ్యూజన్ టైటిల్ చూసి ఏర్పడటం కామనే. కాని ఇక్కడ అసలు విషయం ఏంటంటే రంగస్థలం షూట్ లో చిరు సరదాగా వచ్చారట. షూటింగ్ ఎలా జరుగుతుంది అన్న విషయం తెలుసుకునే క్రమంలోనే చిరు ఆ సినిమా సెట్స్ కు వచ్చారట. క్రేజీ డైరక్టర్ సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక సినిమా సెట్స్ లో చిరు సర్ ప్రైజ్ ఇచ్చేసరికి చిత్రయూనిట్ అంతా అవాక్కయ్యారట. రంగస్థలం చరణ్ కెరియర్ కు ఎంతో ఇంపార్టెంట్ సినిమా అవనుందట. రంగస్థలం 1985 సినిమా 1985 నాటి పరిస్థితులలో వచ్చే ప్రేమకథగా తెరకెక్కుతుందట. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అనసూయ, ఆది పినిశెట్టి కూడా స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. మరి చిరు పర్యవేక్షణలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.  



Related Post

సినిమా స‌మీక్ష