రాజు గారి గది-2 ట్రైలర్ రిలీజ్..!

September 20, 2017


img

ఓంకార్ డైరక్షన్ లో చిన్న బడ్జెట్ తో వచ్చి సూపర్ సక్సెస్ అయిన సినిమా రాజు గారి గది. అప్పట్లో ఆ సినిమా సంచలనం అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్ గా వస్తున్న సినిమా రాజు గారి గది-2. కింగ్ నాగార్జున లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీలో సమంత కూడా నటిస్తుంది. అశ్విన్, సీరత్ కపూర్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

ఇక ఈరోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఊహించిన విధంగానే ఈ సినిమా ట్రైలర్ అటు భయపెడుతూ నవ్వించేసింది. నాగార్జున తన కెరియర్ లో ఎప్పుడు చేయని పాత్రతో ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను పివిపి బ్యానర్లో పరం వి పొట్లూరి నిర్మిస్తున్నారు. ట్రైలర్ అయితే ఇంప్రెసివ్ గానే ఉంది మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. అక్టోబర్ 13 దీపావళి బరిలో దిగుతున్న ఈ సినిమా నుండి వచ్చిన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. 





Related Post

సినిమా స‌మీక్ష