అన్నపూర్ణ స్టూడియోలో అసెంబ్లీ..!

September 20, 2017


img

సూపర్ స్టార్ మహేష్ ఈ నెల 27న స్పైడర్ గా రాబోతున్నాడని తెలిసిందే. మురుగదాస్ తో సినిమా పూర్తి కాకుండానే కొరటాల శివతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు మహేష్. భరత్ అనే నేను టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడని తెలిసిందే.

కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్యను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన అసెంబ్లీ సెట్ అన్నపూర్ణ స్టూడియోలో వేసి షూటింగ్ చేస్తున్నారట. శ్రీమంతుడు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. మరి సిఎంగా మహేష్ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తాడో అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 

సినిమా అసలైతే 2018 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం భరత్ అనే నేను సమ్మర్ కు కాని వచ్చే అవకాశం లేదట. ఇక ఇది పూర్తి కాకుండానే మహేష్ వంశీ పైడిపల్లితో సినిమా షురూ చేస్తున్నాడు.



Related Post

సినిమా స‌మీక్ష