రజినిని దాటేస్తున్న మహేష్..!

September 19, 2017


img

సూపర్ స్టార్ రజినికి సౌత్ లో ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా తమిళ హీరో అయినా తెలుగులో కూడా రజిని ఫాలోయింగ్ తెలిసిందే. అయితే అలాంటి రజినిని కూడా దాటేసి తన సత్తా చాటాలని చూస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్. ఇప్పటికే స్పైడర్ తో తమిళనాట అడుగు పెడుతున్న మహేష్ ట్విట్టర్ లో రజిని ఫాలోవర్స్ ను త్వరలోనే బీట్ చేసి రజిని కన్నా ముందు ప్లేస్ దక్కించుకోనున్నాడు.

ప్రస్తుతం 4 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా రజిని ట్విట్టర్ ఫాలోవర్స్ 4.17 మిలియన్స్ ఉన్నారు. ఇక త్వరలోనే మహేష్ రజినిని క్రాస్ చేస్తాడని అంటున్నారు. కోలీవుడ్ హీరో ధనుష్ సౌత్ లో టాప్ ప్లేస్ లో 5 మిలియన్ పైగా ట్విట్టర్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నాడు. స్పైడర్ రిలీజ్ తర్వాత మహేష్ తమిళ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటే అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ తో టాప్ రేంజ్ కు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పాలి.   



Related Post

సినిమా స‌మీక్ష