తెలుగు నేర్చుకుంటున్న ప్రభాస్ హీరోయిన్

September 13, 2017


img

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో. సుదీప్ డైరక్షన్ లో వస్తున్నా ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ ప్రమోద్  నిర్మిస్తున్నారు. బాహుబలితో నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ నటులను కూడా తీసుకున్నారు. అలాగే హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ని ఎంపిక చేశారని తెలిసిందే.     

రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ షూటింగ్ కి కూడా హాజరవుతోంది. ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో సాగుతోంది. దీంతో శ్రద్ధాకపూర్ కూడా ఇక్కడే ఉంటోంది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ లపై ఓ ఫ్యాక్టరీకి సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నారు. ఆల్ మోస్ట్ వారం రోజులుగా ఈ బీ టౌన్ బ్యూటీ షూటింగ్ లో బిజీ బిజీగా ఉందని సమాచారం. 

అలాగే డైలాగ్ డెలివరీ ఎలా చెప్పాలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోందట. ఆమె నటిస్తున్న ఫస్ట్ తెలుగు మూవీ ఇదే కాబట్టి ఆ మాత్రం కష్టపడాలి కదా.ఇక తెలుగు భాషని నేర్చుకోవడానికి ఓ ట్యూటర్ ని కూడా పెట్టుకుందని తెలుస్తోంది. మూవీ అయ్యేలోపు తెలుగు నేర్చేసుకుని సొంతంగా డబ్బింగ్ ఆలోచనలో ఉందని కూడా ఓ టాక్ నడుస్తోంది. శద్ధ్రా ఈ రేంజ్ కమిట్ మెంట్ చూసి అందరు మెచ్చుకుంటున్నారు.   Related Post

సినిమా స‌మీక్ష