విలన్ గా నారా రోహిత్..?

September 13, 2017


img

నారా రోహిత్ మొదటి సినిమా నుండి విభిన్న చిత్రాలను ఎంచుకుంటున్నాడు. వరుస సినిమాలు చేస్తూ బాగానే క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రెజెంట్ ఆయన నటించిన మూవీ 'కథలో రాజకుమారి' మరో రెండు రోజుల్లో రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 

సినిమాలో నారా రోహిత్ చాలా వరకు విలన్ గా కనిపిస్తాడట. అయితే ఈ విలన్ లైఫ్ లోకి  ఓ అమ్మాయి ఎంట్రీ ఇచ్చేసరికి ఆమె కథలో రాజకుమారి అవుతుందట. విలన్ ని మంచి మనిషిగా ఎలా మార్చింది అనేదే మెయిన్ స్టోరీ అని తెలుస్తోంది.   

ఇక నారా రోహిత్ రెండు డిఫరెంట్ షేడ్స్ కలిగిన క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఈ పాత్రకి నారా రోహిత్ జీవం పోశాడని టాక్.  ఆయన సరసన హీరోయిన్ గా నమితా ప్రమోద్ నటించింది. నాగశౌర్య సినిమా ఆర్టిస్టుగానే గెస్టు రోల్ లో కనిపిస్తాడనీ తెలుస్తోంది. రోహిత్ విలన్ గా కథలో రాజకుమారి ఎలా ఉండనుందో మరో రెండు రోజుల్లో తెలుస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష