జై లవకుశ ఆ సాంగ్ ఊపేయడం ఖాయమా

September 12, 2017


img

జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ నుండి రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పీక్ స్టేజ్ కి చేరేలా చేసింది. ఈ మూవీకి బాబి దర్శకత్వం వహించగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలిసిందే.   

స్టోరీని బట్టి నాలుగు పాటలనే మూవీ యూనిట్ ప్లాన్ చేసింది. కాని అభిమానులను దృష్టిలో పెట్టుకుని మరో పాటని డిజైన్ చేశారు. ఎన్టీఆర్, తమన్నా కాంబినేషన్ లో ఐదవ సాంగ్ ని షూట్ చేశారు. ఈ సాంగ్ ఓ రేంజ్ లో ఉంటుందని ఇప్పటి నుంచే ప్రచారం మొదలైపోయింది. 

ఇక ఈ పాటను గురించి ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ను అందించిన కోన వెంకట్ మాట్లాడారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ బయటికి వచ్చిన నాలుగు పాటలకంటే ఐదవ సాంగ్ సూపర్ లా ఉంటుందని ఊరించారు.ఈ సాంగ్ యూత్ ని ఊపేయడం ఖాయం అంటున్నారు. దీనికితోడు ఈ సాంగ్ లో ఎన్టీఆర్ డాన్స్ ని ఇరగదీశారని చెబుతున్నారు. డ్యాన్స్ పరంగా ఎన్టీఆర్ కెరీర్ లోనే ఈ సాంగ్  నెంబర్ వన్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు. దీంతో ఆ పాట కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.  Related Post

సినిమా స‌మీక్ష