షాలిని పాండేకి వరుస ఆఫర్లు..!

September 12, 2017


img

అర్జున్ రెడ్డి మూవీ సాధించిన విజయం గురించి అందరికి తెలిసిందే. విడుదలకు ముందే వివాదాస్పదమైన ఈ సినిమా విడుదలైన తర్వాత కలక్షన్స్ తో సత్తా చాటింది. ఏదైనా గాని సినిమాని మాత్రం ప్రేక్షకులు బాగానే ఆదరించారు. పెద్ద సినిమాల సరసన నిలబెట్టేశారు.

ఇక ఈ మూవీలో హీరోగా చేసిన విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇక ఈ మూవీలోని హీరోయిన్ గురించే మాట్లాడుకుంటే.. షాలిని పాండే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత విజయ్ కి ఎంతలా అవకాశాలు వస్తున్నాయో షాలిని పాండేకి కూడా అలాగే ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. 

షాలిని పాండేని 'మహానటి' మూవీలో స్పెషల్ పాత్ర కోసం ఎంపిక చేశారు. రీసెంట్ గా 100% లవ్ రీమేక్ లో కూడా ఛాన్స్ కొట్టేసింది. నాగ చైతన్య తమన్నా జంటగా నటించిన ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించారు. ప్రెజెంట్ దీన్ని డైరెక్టర్ చంద్రమౌళి తమిళ్ లో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా జీవీ ప్రకాశ్ నటించనున్నారు. అసలైతే ఆ సినిమాలో హీరోయిన్ గా లావణ్యత్రిపాఠిని అనుకున్నారు. కాని కొన్ని కారణాల వల్ల ఆమె ప్లేస్ లో షాలిని పాండేని తీసుకున్నారు.   Related Post

సినిమా స‌మీక్ష