పాపం లావణ్య.. ఆ రెండు ఛాన్సులు మిస్..!

September 11, 2017


img

సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠికి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందనే చెప్పాలి. ఈమధ్యనే రిలీజ్ అయిన యుద్ధం శరణం అంచనాలను అందుకోవడంలో విఫలమవగా.. ఇక అమ్మడు ఇప్పుడు ఓ రెండు క్రేజీ సినిమాల ఛాన్సులను వదులుకుని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. శ్రీరస్తు శుభమస్తు హిట్ తో అదే గీతా ఆర్ట్స్ సంస్థలో మరో సినిమా అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండతో శ్రీకారం చుట్టారు.

పరశురాం డైరెక్ట్ చేయబోతున్న ఆ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిని కన్ఫాం చేశారు. ఇక ఈలోగా 100% లవ్ తమిళ రీమేక్ అవకాశం కూడా రాగా అక్కడ ఓకే చెప్పేసింది లావణ్య. తమిళ దర్శకుడు చంద్రమౌళి బన్ని వాసుకి ఫోన్ చేసి లావణ్య మీ సినిమా చేయట్లేదు ఎందుకంటే మా సినిమా ఓకే చెప్పిందని అన్నారట. ఇక ఈ కన్ ఫ్యూజన్ ఎందుకని ఆమెను తప్పించి రష్మికను ఫైనల్ చేశారట బన్ని వాసు. ఇక విషయం తెలుసుకున్న లావణ్య 100% లవ్ డైరక్టర్ కు చీవాట్లు పెట్టి ఆ సినిమా నుండి కూడా బయటకు వచ్చిందట. మొత్తానికి అలా చేతికి వచ్చిన రెండు సినిమాలను లావణ్య తన ప్రమేయం లేకుండా వదులుకోవాల్సి వచ్చింది. 

 


Related Post

సినిమా స‌మీక్ష