జై లవ కుశ ట్రైలర్.. తారక్ దుమ్ముదులిపాడు..!

September 11, 2017


img

ఎన్.టి.ఆర్ మూడు పాత్రల్లో నటిస్తూ వస్తున్న సినిమా జై లవ కుశ. బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కళ్యాణ్ రాం నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అందించిన ఈ సినిమా ఆడియో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ సాధించింది. ఇక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

తారక్ మూడు పాత్రల్లో అదరగొట్టాడు అని చెప్పడంలో సందేహం లేదు. సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలను పెంచేలా వచ్చిన ఈ ట్రైలర్ తో తారక్ దుమ్ముదులిపేశాడు. ముఖ్యంగా జై పాత్ర సినిమాకే హైలెట్ అవుతుందని చెప్పాలి. ఘట్టం ఏదైనా.. పాత్ర ఏదైనా.. నేను రె.. రె.. రెడీ అంటూ తారక్ చెప్పిన డైలాగ్ ఒక్కటి చాలు సినిమా రేంజ్ ఏంటన్నది చెప్పడానికి. దసరాకు ముందే బాక్సాఫీస్ పై పండుగ వాతావరణం సృష్టించడానికి వస్తున్న తారక్ జై లవ కుశతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.   


Related Post

సినిమా స‌మీక్ష