ఆనందో బ్రహ్మ రివ్యూ & రేటింగ్

August 18, 2017


img

రేటింగ్ :  3/5

కథ :

సిద్ధు (శ్రీనివాస్ రెడ్డి), ఫ్లూట్ రాజు (వెన్నెల కిశోర్), బాబు (షకలక శంకర్), తులసి (తాగుబోతు రమేష్). ఈ నలుగురు జీవితంలో వచ్చిన కష్టాలతో బాధపడుతుంటారు. డబ్బు అవసరమైన ఈ నలుగురికి శ్రీలక్ష్మి నిలయం ఓనర్ ఎన్నారై రాము (రాజీవ్ కనకాల) ఓ బంపర్ ఆఫర్ ఇస్తాడు. దెయ్యాలున్నాయంటూ ప్రచారం సాగుతున్నా తన ఇంట్లో సిద్ధూ అండ్ బ్యాచ్ ఉండేలా చేస్తాడు. ఓ మూడు రోజులు ఉండేలా వీరి కమిట్మెంట్ కు కోటి రూపాయల క్యాష్ ఇస్తా అంటాడు. వారంతా ఇంట్లో ప్రవేశిస్తారు.. ఇక అక్కడ నుండి అసలు సినిమా మొదలవుతుంది. అసలు ఇంట్లో ఉన్న దెయ్యాలు ఎవరు..? అవి ఎందుకు అలా తిరుగుతాయి..? మనుషులను చూసి అవి ఎందుకు బయపడతాయి అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

పాఠశాల లాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ తో సినిమా తీసిన మహి వి రాఘవ్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత తీసిన సినిమా ఆనందో బ్రహ్మ. సినిమా కథ కథనాల్లో కొత్తదనం కనిపిస్తుంది. సాధారణంగా హర్రర్ కామెడీ అంటే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి దెయ్యాలను చూసి బయపడేలా చేస్తారు. కాని ఇక్కడ మనుషులను చూసి దెయ్యాలు బయపడటం అనేది కొత్త పాయింట్. 

కథనం సాగించిన విధానం బాగుంటుంది. ఇంటర్వల్ సీన్స్ తో పాటుగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి. అయితే మొదటి భాగం ఎక్కువ పాత్రల పరిచయానికే ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుంది. అసలు సినిమా సెకండ్ హాఫ్ లో నడుస్తుంది. ఈ సెకండ్ హాఫ్ కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మీద దర్శకుడు ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. 

రొటీన్ హర్రర్ సినిమాల్లానే కథనం సాగించినట్టు అనిపించినా దర్శకుడు సినిమాలో ప్రతి క్యారక్టర్ ను బాగా వాడుకున్నాడు. తాప్సీ తన పాత్ర మేరకు నటించగా శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిసోర్, తాగుబోతు రమేష్, షలక శంకర్ ఎంటర్టైన్ చేశారు. యూత్ ఆడియెన్స్ కు కచ్చితంగా నచ్చే సినిమా అవుతుంది. 

నటన, సాంకేతిక వర్గం :

తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ఆనందో బ్రహ్మ ఆమె ఉన్నంతవరకు ఆమె పాత్రకు న్యాయం చేసింది. అయితే ఆమె కన్నా సినిమాలో మిగతా పాత్రల వెయిట్ ఎక్కువగా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి ఎప్పటిలానే ఆకట్టుకోగా.. వెన్నెల కిశోర్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు. తాగుబోతు రమేష్ కూడా నవ్వించాడు. ఇక సినిమాలో షకలక శంకర్ కామెడీ మరోసారి హైలెట్ గా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్, రాందేవ్ బాబా స్పూఫ్ తో వచ్చిన అవకాశాన్ని అన్నివిధాలుగా వాడుకున్నాడు షకలక శంకర్. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు. 

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. అనిష్ తరుణ్ కుమార్ కెమెరా వర్క్ బాగుంది. కె సంగీతం ఓకే అనిపిస్తుంది.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మహి వి రాఘవ్ కథ కథనాల్లో తన పట్టు సాధించాడు. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమా అంత ఇంటి చుట్టే తిరిగినా ఎక్కడ రాజి పడకుండా నిర్మించారు నిర్మాతలు విజయ్, శషి దేవిరెడ్డి. 

ఒక్కమాటలో :

రొటీన్ కు భిన్నంగా వచ్చిన ఈ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ కచ్చితంగా ఆడియెన్స్ ను అలరిస్తుందని చెప్పొచ్చు. యూత్ ఆడియెన్స్ కు నచ్చే అంశాలన్ని ఉన్న ఈ ఆనందో బ్రహ్మ అందరి మనసులను గెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష