నేనే రాజు నేనే మంత్రి రివ్యూ & రేటింగ్

August 11, 2017


img

రేటింగ్ : 2.5/5

కథ :

జోగేంద్ర (రానా) రాధా (కాజల్) భార్య భర్తలు.. ఒకరంటే ఒకరికి ప్రాణం.. వడ్డీవ్యాపారి అయిన జోగేంద్ర మొదటిసారి తండ్రి అయ్యే అవకాశాన్ని సర్పంచ్ భార్య వల్ల పోగొట్టుకుంటాడు. ఈ క్రమంలో జోగేంద్ర సర్పంచ్ అవ్వాలని అనుకుంటాడు అదే క్రమంలో ఆ ఏరియా ఎమ్మెల్యేని చంపి ఆ తర్వాత సునాయాసంగా మినిస్టర్ అయిపోతాడు. ఇక తన కన్ను సిఎం కుర్చి మీద పడుతుంది. ఈ ప్రయాణంలో హోం మంత్రితో శత్రుత్వం పెంచుకుంటాడు జోగేంద్ర. ఇంతకీ జోగేంద్ర సిఎం అయ్యాడా..? రాధా జోగేంద్ర కలిసే ఉన్నారా..? మిగతా కథ ఏంటి అన్నది తెర మీద చూడాల్సిందే.

విశ్లేషణ :

హోరా హోరి తర్వాత తేజ కం బ్యాక్ మూవీ నేనే రాజు నేనే మంత్రి. తన మార్క్ సినిమాలకు దూరంగా ఈ కథ కథనాలను ఎంచుకున్నాడు తేజ. నేనే రాజు నేనే మంత్రి సినిమా టైటిల్ కు తగ్గట్టుగా హీరో పాత్ర విధి విధానాలను నడిపించాడు. అయితే మొదటి భాగం నడిపించినంత స్పీడ్ గా సెకండ్ హాఫ్ నడిపించలేదు. సెంటిమెంట్ సీన్స్ ఎక్కువవయ్యాయని అనిపిస్తుంది. 

సినిమా హీరో కాబట్టి అంతా సినిమాటిక్ గా నడిపించాడు తేజ. సాధారణ వడ్డీ వ్యాపారిగా ఉన్న జోగేంద్ర మంత్రి స్థాయి అతన్ని ఆడించడం కామెడీగా ఉంటుంది. ఇక ఇంత చేసేది రాధ కోసమే అయినా ఆమెను కూడా చివర్లో దూరం చేసుకోవాలనుకోవడం అంతా ఏదో అలా సాగుతుంటాయి. ఇక క్లైమాక్స్ లో కూడా రాధ లేనిదే జోగేంద్ర ఉండడు అని పోలీసులు ఉరి శిక్ష ఆపేసినా సరే జోగేంద్ర పాత్ర ఉరేసుకోవడం కాస్త అతిగా అనిపిస్తుంది.

క్యారక్టర్ రానా పరంగా బాగా చేశాడు తేజ రాయడంలోనే క్లారిటీ మిస్ అయ్యాడని చెప్పొచ్చు. సినిమా ట్రైలర్ టీజర్ తో ఆడియెన్స్ ఎట్రాక్ట్ చేసిన నేనే రాజు నేనే మంత్రి సినిమాలో అంతగా ఆకట్టుకోలేకపోయాడు.

నటన, సాంకేతిక వర్గం :

జోగేంద్రగా రానా బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. బాహుబలి-2 తర్వాత రానా చేసిన ఈ సినిమా తన కెరియర్ గ్రోతింగ్ కు ఉపయోగపడుతుంది. ఇక హీరోయిన్ గా కాజల్ రాధగా హోంలీ లుక్ లో బాగా నటించింది. పతాక సన్నివేశాల్లో కాజల్ ఫ్యాన్స్ కు పండుగే. ఇక కేథరిన్ కూడా హాట్ లుక్స్ తో అదరగొట్టగా.. నవదీప్ మరో మంచి పాత్రతో ఆకట్టుకున్నాడు. శివాజీరాజా, అశుతోష్ రానా, తణికెళ్ల భరణి మిగిలిన వారంతా పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే సినిమా మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది కాబట్టి కెమెరా వర్క్ బాగుంది. అనూప్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. సెకండ్ హాఫ్ ఇంకాస్త ట్రిం చేసి ఉంటే బాగుండేది. ఎడిటింగ్ ఓకే. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత కావాలో అంత పెట్టేశారు.

ఒక్కమాటలో :

యువత రాజకియాల మీద ఉన్న ఆలోచనని కొత్త కోణంలో చెప్పాలని వచ్చిన నేనే రాజు నేనే మంత్రి ఓటు విలువని చెప్పాడు. కాని సినిమా మాత్రం అంచనాలను అందుకోలేదు.


Related Post

సినిమా స‌మీక్ష