ఎన్టీఆర్ ఆర్ట్స్ లో నాని..!

July 25, 2017


img

నాచురల్ స్టార్ నాని నటించిన నిన్ను కోరి సూపర్ హిట్ ఖాతాలో చేరిపోగా ప్రస్తుతం నాని వేణు శ్రీరాం డైరక్షన్ లో ఎం.సి.ఏ మూవీ చేస్తున్నాడు. ఇక ఇదే కాకుండా మేర్లపాక గాంధి డైరక్షన్ లో కృష్ణార్జున యుద్ధం సినిమా కూడా చేస్తున్నాడు నాని. ఇక ఈ రెండు పూర్తి కాగానే ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నాని సినిమా చేస్తాడని అంటున్నారు.

నందమూరి కళ్యాణ్ రాం నిర్మాణంలో నాని హీరోగా సినిమా ఉంటుందట. ఇప్పటికే రవితేజ కిక్-2 నిర్మించిన కళ్యాణ్ రాం ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న జై లవకుశ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక నాని సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అన్న విషయం ఇంకా బయటకు రాలేదు. నానితో సినిమా అంటే నిర్మాత సేఫ్ జోన్ లో ఉన్నట్టే. 10 కోట్లతో సినిమా తీసి 30 కోట్ల కలక్షన్స్ సాధిస్తున్న నాని వరుస విజయాలతో స్టార్ హీరోలకు సైతం షాక్ ఇస్తున్నాడు.



Related Post

సినిమా స‌మీక్ష