రాజు గారికి రిలీజ్ కష్టాలు..!

July 25, 2017


img

స్టార్ హీరోల రిలీజ్ టైంలో చిన్న సినిమాల రిలీజ్ కష్టమవుతున్న ఈ తరుణంలో ఛాన్స్ దొరికిన డేట్ కే ఒకేసారి సినిమాలన్ని వచ్చి పడుతున్నాయి. ఇందులో యువ హీరోల సినిమాలు కూడా ఉండటం విశేషం. దసరా బరిలో బాక్సాఫీస్ షేక్ చేసేందుకు స్టార్స్ సినిమాలు వరుస కడుతుంటే ఆగష్టులో కూడా సినిమాల సందడి బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది.

ముఖ్యంగా ఆగష్టు 11న లాంగ్ వీకెండ్ గురి పెట్టి మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో ఒకటి బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ జయ జానకి నాయకా, రెండోది నితిన్ హను రాఘవపుడి లై.. మూడవది తేజ రానా కలిసి చేసిన నేనే రాజు నేనే మంత్రి. లై, జయ జానకి నాయకా సినిమాలు కాస్త కూస్తో క్రేజ్ తెచ్చుకున్నాయి కాని రానా నేనే రాజు నేనే మంత్రి మాత్రం సోషల్ మెసేజ్ తో వస్తుంది. అందుకే పోటీలోంచి సినిమా తప్పుకునట్టే కనిపిస్తుంది. ఆగష్టు 11న వదిలి ఆ తర్వాత వారం నేనే రాజు నేనే మంత్రి రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. మరి రాజు గారు ఎందుకు భయపడ్డారో తెలియదు కాని సినిమా మాత్రం వారం రోజులు పోస్ట్ పోన్ అవుతుంది.



Related Post

సినిమా స‌మీక్ష