ఆరోజు ఫ్యాన్స్ కు డబుల్ గిఫ్ట్ అంటున్న మహేష్..!

July 24, 2017


img

సూపర్ స్టార్ ప్రభాస్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. ఇక అది పూర్తి కాకుండానే మహేష్ కొరటాల శివతో భరత్ అను నేను సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. స్పైడర్ గురించి కేవలం ఓ టీజర్ మాత్రమే వదిలిన చిత్రయూనిట్ మరో స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అంతేకాదు భరత్ అను నేను ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 

ఈ రెండు సినిమాల టీజర్ లను ఆగష్ట్ 9 మహేష్ బర్త్ డే నాడు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇది నిజంగా మహేష్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. ఇన్నాళ్ల మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఈ పుట్టినరోజు నాడు అదిరిపోయే కానుక ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. మరి ఆ కానుకలు ఎలా ఉంటాయో చూడాలి.

 


Related Post

సినిమా స‌మీక్ష