ప్రభాస్ తో అనుష్క అంతా ఉత్తిత్తే..!

July 24, 2017


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్వీటీ అనుష్క ఈ ఇద్దరు కలిసి నటిస్తే ఆ సినిమాకు వచ్చే క్రేజ్ ఏంటో అందరికి తెలుసు. ఇప్పటికే బిల్లా, మిర్చి, బాహుబలి రెండు పార్టులు ఇలా మూడు నాలుగు సినిమాలతో వీరి పెయిర్ సూపర్ హిట్ అయ్యింది. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా సాహో. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా యువి క్రియేషన్స్ పతాకంలో 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది.

ఈ సినిమాలో ప్రభాస్ తో అనుష్క నటిస్తుందని రూమర్ కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తుంది. ఈ క్రమంలో అనుష్క ప్రస్తుతం సాహో కోసం డేట్స్ అడ్జెస్ట్ చేయలేదని చెప్పేసిందట. ప్రస్తుతం భాగమతి సినిమా చేస్తున్న అనుష్క ఆ తర్వాత తమిళ సినిమాకు కమిట్ అయ్యిందట. అందుకే ప్రభాస్ తో నటించేది అనుష్క కాదని డిక్లేర్ చేశారు. మరి ప్రభాస్ సాహోలో ఆ లక్కీ ఛాన్స్ అందుకునే హీరోయిన్ ఎవరో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష