ఈ బాలకృష్ణుడు భలే ఉన్నాడే..!

July 24, 2017


img

ప్రస్తుతం టాలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలను చేస్తూ ఆడియెన్స్ లో సెపరేట్ క్రేజ్ ఏర్పరచుకున్న హీరో నారా రోహిత్. నారా వారి ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ హీరో సగటు సిని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈమధ్యనే శమంతకమణి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కుర్ర హీరోలతో మల్టీస్టారర్ అదరగొట్టిన నారా రోహిత్ ఈసారి సోలోగా బాలకృష్ణుడు సినిమాతో వస్తున్నాడు.

పవన్ మల్లెల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రెజినా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు రిలీజ్ చేశారు. బాలకృష్ణుడు లుక్ లో నారా రోహిత్ సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమా మీద ఓ మంచి ఒపినియన్ పడేలా చేసుకున్నాడు రోహిత్. మణిశర్మ మ్యూజిక్ అందించబోతున్న ఈ సినిమాలో నారా రోహిత్ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. మరి వరుస హిట్లతో మంచి ఫాంలో ఉన్న రోహిత్ ఈ బాలకృష్ణుడిగా ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష