ఈ సిఎం అదరగొట్టడం ఖాయం..!

July 24, 2017


img

మహేష్ స్పైడర్ తర్వాత కొరటాల శివతో చేస్తున్న సినిమా భరత్ అను నేను. సినిమాలో మహేష్ సిఎంగా నటిస్తాడని తెలిసిందే. ఈ క్రమంలో సిఎం గా మహేష్ ఎలా ఉంటాడు అన్నదాని మీద ఓ క్లారిటీ ఇచ్చాడు కొరటాల శివ. హీరో సిఎం అనగానే పొలిటికల్ సెటైర్.. పొలిటికల్ పంచులు ఆలోచించడం కామనే. కాని కొరటాల శివ మాత్రం ఓ కొత్తరకం సిఎంను చూపిస్తా అంటున్నాడు. 

ఇలాంటి సిఎం ఉంటే ఎంత బాగుండి అని మహేష్ ను చూస్తే అనిపిస్తుందని చెబుతున్నాడు కొరటాల శివ. శ్రీమంతుడులో ఊరు దత్తత కాన్సెప్ట్ తో హిట్ అందుకున్న ఈ కాంబినేషన్ లో ఇప్పుడు మరో కొత్త సబ్జెక్ట్ తో భరత్ అను నేను సినిమా రాబోతుంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా 2018 సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.   



Related Post

సినిమా స‌మీక్ష