పటేల్ S.I.R రివ్యూ & రేటింగ్

July 14, 2017


img

రేటింగ్ : 2/5

కథ :

ఆర్మీ మేజర్ గా రిటైర్డ్ అయిన సుభాష్ పటేల్ (జగపతి బాబు) తన కుటుంబాన్ని నాశనం చేసిన వారిని చంపాలనుకుంటాడు. యుద్ధం చేయాల్సింది బోర్డర్ లో కాదని తెలుస్కుని దేవరాజ్ (కబీర్ సింగ్) గ్యాంగులో ఒక్కొక్కరిని దారుణంగా చంపుతూ వస్తుంటాడు. ఈ క్రమంలో అసలు ఈ మర్డర్లన్ని ఎందుకు చేస్తున్నాడు అన్నది అసలు ట్విస్ట్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కేథరిన్ (తన్య హోప్) పటేల్ సర్ ఈ మర్డర్లు చేస్తున్నాడని తెలుసుకుంటుంది. పటేస్ల్ సర్ గతం ఏంటి..? దేవరాజ్ గ్యాంగ్ ను ఎందుకు టార్గెట్ చేశాడు అన్నది అసలు కథ.

విశ్లేషణ :

వాసు పరిమి రాసుకున్న కథ పాత చింతకాయ పచ్చడే. రొటీన్ రివెంజ్ డ్రామానే రిటైర్డ్ ఆర్మీ అంటూ కొత్త బ్యాక్ గ్రౌండ్ తీసుకున్నట్టు ఉంటుంది. కాని రివెంజ్ తీర్చుకునే విధానం మాత్రం పక్కా పాత సినిమాల పద్ధతిలోనే ఉంటుంది. ముఖ్యంగా విలనిజం కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు.

ఫస్ట్ హాఫ్ సోసోగా నడుస్తుంది.. ఇక సెకండ్ హాఫ్ లో త్విస్ట్ కూడా అంత పెద్ద థ్రిల్ అనిపించదు. స్క్రీన్ ప్లే కాస్త కొత్తగా రాసుకున్నాడని అనిపించినా రొటీన్ కథ కాబట్టి అంతగా ఆకట్టుకోదు.జగపతి బాబు నటనను బాగా వాడుకున్నారు.

రొటీన్ రివెంజ్ స్టోరీ అయినా జగ్గుభాయ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. విలన్ గా చేస్తూ మళ్లీ హీరోగా టర్న్ తీసుకున్న జగపతి బాబు తన పరంగా సినిమాకు ప్రాణం పోశాడు. కాని మిగతా యాస్పెక్ట్ లో అంతగా పర్ఫెక్షన్ చూపించలేదు.

నటన, సాంకేతికవర్గం :

సినిమా మొత్తం జగపతి బాబు వన్ మ్యాన్ షో చేశాడు. ఎలాంటి క్యారక్టర్ అయినా చేసే దమ్ము తనకుందని మరోసారి నిరూపించాడు జగపతి బాబు.  తన వయసుకి తగ్గ పాత్రతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ ఆమని చాలా రోజుల తర్వాత కనిపించి మెప్పించారు. తన్య హోప్ నటన పర్వాలేదు. విలన్ గా కబీర్ సింగ్ క్యారక్టర్ ఓకే. ఇక పృధ్వు, ప్రభాకర్, పోసాని, రఘుబాబులు పర్వాలేదు అనిపించారు.   

టెక్నికల్ టీం విషయ్యానికొస్తే.. వసంత్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపిస్తుంది.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. శ్యాం కె నాయుడు సినిమాటోగ్రెఫీ బాగుంది. దర్శకుడు వాసు పరిమి రొటీన్ కథకే కొత్త రంగులద్ది పటేల్ సర్ ను తీశాడు. దర్శకుడిగా ఓకే కాని కథ కథనాల విషయంలో దర్శకుడు ఇంకా ప్రతిభ కబరచాల్సి ఉంది. సాయి కొర్రపాటి ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్.

ఒక్కమాటలో :

రొటీన్ కథే కాని జగ్గు భాయ్ ఇంప్రెస్ చేశాడు..!



Related Post

సినిమా స‌మీక్ష